ASBL Koncept Ambience
facebook whatsapp X

రెగాన్ ప్రపంచ రికార్డు

రెగాన్ ప్రపంచ రికార్డు

అమెరికా స్విమ్మర్‌ రెగాన్‌ స్మిత్‌ సత్తాచాటింది. అమెరికా స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో ఆమె  ప్రపంచ రికార్డు తిరగరాసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 57.13 సెకన్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్విమ్మర్‌ కేలీ మెక్‌యోన్‌ నిరుడు నెలకొల్పిన ప్రపంచ రికార్డు (57.33సె)ను 22 ఏళ్ల రెగాన్‌ బద్దలు కొట్టింది. రెగాన్‌ 17ఏళ్ల వయసులోనే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలో ఆమె ప్రపంచ రికార్డు నమోదు చేయడం విశేషం. ఒక్కసారిగా వచ్చిన పేరు, ప్రతిష్ఠలతో ఆమె దారి తప్పింది. మెక్‌యోన్‌ ఆధిపత్యంలో రెగాన్‌ కనుమరుగైంది. టోక్యో ఒలింపిక్స్‌లో మెక్‌యోన్‌ స్వర్ణం నెగ్గగా, రెగాన్‌ కాంస్యానికే పరిమితమైంది. ఇప్పుడు దిగ్గజ స్విమ్మర్‌ మైకెల్‌ ఫెల్ప్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన బాబ్‌ బోమన్‌ శిక్షణతో రెగాన్‌ తిరిగి గాడిన పడుతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :