ASBL Koncept Ambience
facebook whatsapp X

డ‌బుల్ ఇస్మార్ట్ పై రామ్ కాన్ఫిడెన్స్

డ‌బుల్ ఇస్మార్ట్ పై రామ్ కాన్ఫిడెన్స్

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డ‌బుల్ ఇస్మార్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేట‌వ‌డం వ‌ల్ల వాయిదాలు ప‌డుతూ ఆగ‌స్ట్ 15ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకుంది. డ‌బుల్ ఇస్మార్ట్ కోసం పూరీ, రామ్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మాస్ట‌ర్ స్ట్రోక్ ఇవ్వాల‌ని రామ్ రెడీగా ఉన్నాడు. డ‌బుల్ ఇస్మార్ట్ విజ‌యం ఇటు రామ్‌కి, అటు పూరీకి ఎంతో కీల‌కం. ఇద్ద‌రూ త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ది వారియ‌ర్, స్కంద ఫ్లాపుల‌తో రామ్ డిజాస్ట‌ర్ల‌లో ఉంటే, లైగ‌ర్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు పూరీ.

వీరిద్ద‌రికీ కావాల్సినంత టాలెంట్ ఉంది. మంచి సినిమా ప‌డితే ఇద్ద‌రికీ రికార్డులు సృష్టించే స్టామినా ఉంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ఆడియ‌న్స్ కు కిక్ ఇస్తున్న‌ప్ప‌టికీ పూరీని న‌మ్మ‌లేక‌పోతున్నారు. పూరీని న‌మ్మ‌క‌పోయినా ఈసారి రామ్ ను న‌మ్మొచ్చంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఇప్ప‌టికే రెండు వరుస ఫ్లాపుల‌తో దెబ్బ తిన్న రామ్, డ‌బుల్ ఇస్మార్ట్ క‌థ‌లో ఎంతో ఎగ్జైట్మెంట్ ఉంటే త‌ప్పించి ఓకే చేయ‌డు. అందుకే డ‌బుల్ ఇస్మార్ట్ విష‌యంలో ఎవ‌రేం చెప్పినా రామ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నాడు. మ‌రి ఈ సినిమా రామ్ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతుందో లేదో చూడాలి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :