ASBL Koncept Ambience
facebook whatsapp X

RC16లో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

RC16లో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్ర‌త్త‌గా అడుగులేస్తున్నాడు. మంచి కంటెంట్ తో పాటూ బ‌ల‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ ఉన్న క‌థ‌ల‌కే చ‌ర‌ణ్ ఓటేస్తున్నాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్నాడు.

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ బుచ్చి బాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విష‌యం విదిత‌మే. పీరియాడిక‌ల్ జాన‌ర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. RC16 వ‌ర్కింగ్ టైటిల్ తో మొద‌లైన ఈ సినిమా క‌థ ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ సినిమాలోని త‌న పాత్ర కోసం చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా ఆ స్లాంగ్ నేర్చుకునే ప‌నిలో ఉన్నాడు.

RC16 లో చ‌ర‌ణ్ ట్రైబ‌ల్ స్పోర్ట్ మెన్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని లీకులందుతున్నాయి. ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంద‌ని, అందుకే ఆ క్యారెక్ట‌ర్ కోసం చ‌ర‌ణ్ ఆస్ట్రేలియాలో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకోవడానికి త్వ‌ర‌లోనే వెళ్తున్నాడ‌ని తెలుస్తోంది. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ లో త‌న పోర్ష‌న్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ ఇప్పుడు త‌న దృష్టంతా బుచ్చిబాబు సినిమాపైనే పెట్టారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ త‌న బాడీ ట్రాన్స్ఫ‌ర్మేష‌న్ పై ఫోక‌స్ చేశాడ‌ని, అది పూర్త‌య్యాక సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :