ASBL NSL Infratech

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి 'తిరగబడరసామీ' నుంచి రాధాభాయ్ సాంగ్

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి 'తిరగబడరసామీ' నుంచి రాధాభాయ్ సాంగ్

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. తాజాగా మేకర్స్ మన్నారా పై చిత్రీకరించిన రాధాభాయ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. భోలే షావలి ఈ పాటని క్యాచి మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ అందించిన ఈ పాటని శ్రావణ భార్గవి హైలీ ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :