ASBL Koncept Ambience
facebook whatsapp X

ఓవ‌ర్సీస్ లో పుష్ప2 ర‌చ్చ‌

ఓవ‌ర్సీస్ లో పుష్ప2 ర‌చ్చ‌

ఇంకో నెల రోజులు టైమ్ ఉండ‌గానే పుష్ప‌2(Pushpa2) హైప్ చూస్తుంటే మెంట‌లెక్కేస్తుంది. ఓవ‌ర్సీస్ లో పుష్ప‌2 అప్పుడే రికార్డుల ఊచ‌కోత స్టార్ట్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు పుష్ప‌2 అడ్వాన్స్ బుకింగ్స్ తో 4 ల‌క్ష‌ల 10 వేల అమెరిక‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి పుష్ప‌1(Pushpa1) ఫుల్ ర‌న్ ను దాటేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఓపెన్ చేసిన 2750 షోల‌లో 15 వేల‌కు పైగా టికెట్స్ అమ్ముడ‌య్యాయి.

ఇంకా చాలా షోలు యాడ్ చేయాల్సి ఉంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ పుష్ప‌2 నెంబ‌ర్స్ షాక్ ఇచ్చేలా అనిపిస్తోంది. ఇంకా చాలా టైముంది కాబ‌ట్టి ప్రీమియ‌ర్ల క్లోజింగ్ నెంబ‌రే ఊహ‌కు అంద‌డం లేదు. చూస్తుంటే ఆర్ఆర్ఆర్(RRR), క‌ల్కి(Kalki) నెంబ‌ర్ల‌ను ట‌చ్ చేసేలా ఉంది పుష్ప‌2. నార్త్ అమెరికాలోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక కెన‌డా మిగిలిన దేశాల్లో టికెట్స్ సేల్స్ మొద‌లైతే ర‌చ్చ మామూలుగా ఉండ‌దేమో.

మ‌రోప‌క్క తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టికే డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి థ‌ర్డ్ పార్టీ భారీ మొత్తానికి సెంట‌ర్ల వారీగా కొనేసుకుంటున్నట్లు స‌మాచారం. వేకువ‌ఝాము నుంచే షోలు ఉంటాయి కాబ‌ట్టి పుష్ప‌2 భారీ ఓపెనింగ్స్ ద‌క్క‌డం ఖాయం. ట్రైల‌ర్ వ‌చ్చాక ఈ హంగామా మరింత పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పుష్ప‌2 ఐటెం సాంగ్ షూటింగ్ జ‌రుగుతోంది. 

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :