ASBL NSL Infratech
facebook whatsapp X

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం

ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్న ఆమె ఈ అవార్డుని అందుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం  అధికారికంగా ప్రకటించిది. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ ఫిజీని బలమైన, సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందన్నారు. దీంతో రెండు దేశాల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటాలను గుర్తు చేశారు. ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :