ASBL Koncept Ambience
facebook whatsapp X

పూజా కంబ్యాక్ మామూలుగా లేదుగా!

పూజా కంబ్యాక్ మామూలుగా లేదుగా!

స‌క్సెస్ అయిన ఇండ‌స్ట్రీ నుంచి ఒక‌సారి బ‌య‌టికెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ వ‌ద్దామని వెళ్తే అనుకున్నంత ఈజీగా మళ్లీ రాలేరు. అలాంటి వారికి ఛాన్సులివ్వ‌డానికి ఏ డైరెక్ట‌ర్, నిర్మాత‌, హీరో కూడా ముందుకు రారు. వేరే ఆప్ష‌న్ వెతుక్కుంటారు కానీ వెళ్లిపోయిన వారిని బ్ర‌తిమాలి తెచ్చుకునే పెట్టుకునేంత మాత్రం ఉండ‌దు. అలానే టాలీవుడ్ కు ఎంతోమంది భామ‌లు దూర‌మ‌య్యారు.

కానీ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde)కు మాత్రం ఇది మిన‌హాయింపుగా క‌నిపిస్తోంది. మంచి ఫామ్ లో ఉన్న‌ప్పుడు టాలీవుడ్‌ను వ‌దిలి బాలీవుడ్ కు వెళ్లింది పూజా. అక్క‌డ ఛాన్సులొచ్చినంత కాలం సినిమాలు చేసింది. అయితే ఇప్పుడక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో తిరిగి సౌత్ వైపు వ‌చ్చేసింది. జ‌స్ట్ రావ‌డం మాత్ర‌మే కాదు ఈ విష‌యంలో పూజా స‌క్సెస్ కూడా అయింది.

ప్ర‌స్తుతం పూజా లైన‌ప్ చూస్తే కంబ్యాక్ అంటే ఇదీ అనిపించ‌క మాన‌దు. కోలీవుడ్ హీరో సూర్య(Suriya) న‌టిస్తున్న 44వ సినిమాలో పూజానే హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూజా ఇప్ప‌టికే పూర్తి చేసింది. తెలుగులో నాగ చైత‌న్య(Naga Chaitanya) స‌ర‌స‌న ఓ కొత్త సినిమా ఛాన్స్ ను కూడా పూజా అందుకుంది. ఇప్పుడు తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్69(Vijay69)లో కూడా పూజానే ఎంపికైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇలా వ‌రుసగా స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు రావ‌డ‌మంటే పూజా ల‌క్ మామూలుగా లేన‌ట్టే.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :