ASBL Koncept Ambience
facebook whatsapp X

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప‌రిస్థితేంటో..

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప‌రిస్థితేంటో..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు న‌టుడు మాత్ర‌మే కాదు ఒక విజ‌యవంత‌మైన రాజ‌కీయ నాయ‌కుడు కూడా. ఇదివ‌ర‌కులా ప‌వ‌న్ సినిమాల‌కు టైమిచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అయితే ఎల‌క్ష‌న్స్ కు ముందు ప‌వ‌న్ మూడు సినిమాల‌కు క‌మిట్ అయిన విష‌యం తెలిసిందే. వాటిలో ఒక‌టైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నాలుగేళ్ల నుంచి సెట్స్ పైనే ఉంది.

ఆ సినిమా ఇప్ప‌ట్లో పూర్త‌వుతుందో లేదోన‌ని డైరెక్ట‌ర్ క్రిష్ సినిమా నుంచి త‌ప్పుకుని బ‌య‌ట‌కొచ్చేసి మ‌రో సినిమా కూడా మొద‌లుపెట్టాడు. సుజిత్ డైరెక్ష‌న్ లో ఓజి సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. ఈ రెండింటితో పాటూ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాను కూడా ప‌వ‌న్ మొద‌లుపెట్టాడు.

త‌మిళ హిట్ తేరి కు రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. అయితే ప‌వ‌న్ పూర్తిగా ఫ్రీ అయ్యాక ఈ సినిమాను రీస్టార్ట్ చేస్తాన‌ని చెప్పి హ‌రీష్ శంక‌ర్ ఈ లోపు ర‌వితేజ‌తో క‌లిసి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ను స్టార్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ వ‌చ్చి ఉస్తాద్ చేస్తాన‌న్నా హ‌రీష్ మొద‌లుపెట్టలేని ప‌రిస్థితి. ప‌వ‌న్ ముందు రెండు సినిమాల‌ను పూర్తి చేయ‌డానికే ఈ ఇయ‌ర్ ఎండింగ్ వ‌ర‌కు టైమ్ ప‌ట్టేట్టుంది. ఈ నేప‌థ్యంతో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ నెక్ట్స్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావాలంటే నెక్ట్స్ ఇయ‌ర్ సెకండాఫ్ లోనే సాధ్య‌మ‌య్యేట్లు క‌నిపిస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :