ASBL Koncept Ambience
facebook whatsapp X

నీల్ సినిమాలో మ‌రింత క్రూరంగా ఎన్టీఆర్

నీల్ సినిమాలో మ‌రింత క్రూరంగా ఎన్టీఆర్

ప్ర‌శాంత్ నీల్ సినిమాల్లో హీరో పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటుందో అంతే నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. నీల్ మొద‌టి సినిమా ఉగ్రం లో హీరో పాత్ర మాఫియా బ్యాక్ డ్రాప్ లో డాన్ గా ఎదిగే వాడిలా ఆ పాత్ర‌ను డిజైన్ చేశారు. కేజీఎఫ్ లో రాకీభాయ్ పాత్రను ఓ వైపు నెగిటివ్ షేడ్స్ ను హైలైట్ చేస్తూనే మ‌రోవైపు మంచి వాడిగా చూపించాడు.

ప్ర‌శంత్ నీల్ క‌థ‌ల్లో ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లుంటాయి. కాక‌పోతే వారిలో ఒక మంచి విల‌న్ హీరో పాత్ర చేస్తే ఇంకొక‌రు విల‌న్ గా ఉంటాడు. స‌లార్ సినిమాలో కూడా అంతే. దేవా క్యారెక్ట‌ర్ ను రౌడీ లానే ప్రెజెంట్ చేశాడు నీల్. న్యాయం వైపు నిలబ‌డే రౌడీగా ప్ర‌శాంత్ నీల్ త‌న హీరోను చూపిస్తాడు. అందుకే అవుట్ ఆఫ్ ది బాక్స్ లో రియాలిటికీ దూరంగా ఓ కొత్త ప్ర‌పంచంలో న‌డిచే నీల్ క‌థ‌లకు ఆడియ‌న్స్ క‌నెక్ట్ అవుతారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ప్ర‌శాంత్ నీల్ త‌న త‌ర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం నీల్ ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు నీల్ సినిమాల్లో చూసిన వాటికంటే క్రూరంగా ఉంటుంద‌ని, పూర్తి స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్లో ఎన్టీఆర్ ను చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :