తగ్గేదేలే అంటున్న స్వయంభు
కార్తికేయ2 సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. దీంతో నిఖిల్ నెక్ట్స్ సినిమాపై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి ది ఇండియన్ హౌస్ కాగా మరొకటి స్వయంభు. సీరియాడికల్ కథతో వస్తున్న స్వయంభుకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.
కార్తికేయ2తో నిఖిల్ మంచి హిట్ అందుకోవడంతో పాటూ దేశమంతటా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో స్వయంభును పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడైతే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిందో అప్పటినుంచి సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. దీంతో నార్త్ నుంచి ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట.
దీంతో ఈ సినిమాను మరింత క్వాలిటీగా రూపొందించాలని ఫిక్స్ అయిన నిర్మాతలు స్వయంభు బడ్జెట్ ను ఇంకాస్త పెంచుతున్నారట. మొన్నటివరకు సినిమాను ఒక బడ్జెట్ లో పూర్తి చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు బిజినెస్ పెరుగుతుండటంతో బడ్జెట్ పెంచుతున్నారు. నిఖిల్ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. స్వయంభుపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
.