ASBL Koncept Ambience
facebook whatsapp X

చికాగోలో 'నేషనల్ ఇండియా హబ్' 

చికాగోలో 'నేషనల్ ఇండియా హబ్' 

చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇంద్రాణి ఫేమ్ అంకిత ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేషనల్ ఇండియా హబ్ గురించి వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. 'Unite, Celebrate, Help Each Other' ప్రధాన సూత్రాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్ కిందకు రావటం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకునే విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :