ASBL Koncept Ambience
facebook whatsapp X

నాని కోసం క్యూ క‌డుతున్న నిర్మాత‌లు

నాని కోసం క్యూ క‌డుతున్న నిర్మాత‌లు

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన హీరో నాని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గ‌తేడాది ద‌స‌రా, హాయ్ నాన్న సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి వ‌రుస హిట్లు అందుకున్న నాని చేతిలో ప్ర‌స్తుతం మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. ప్ర‌స్తుతం నాని, వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం సినిమా చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే స‌రిపోదా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని సినిమా అంటే ఆడియ‌న్స్ మినిమ‌మ్ గ్యారెంటీ ఫిల్మ్ అని ఫిక్స్ అయిపోతారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో నానికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అన్న విష‌యం తెలిసిందే. డైరెక్ట‌ర్ ఎవ‌రైనా స‌రే నాని త‌న‌లోని టాలెంట్ మొత్తాన్ని బ‌య‌ట పెట్టేస్తాడు.

టాలీవుడ్ లోని మిగిలిన హీరోల‌తో పోలిస్తే నాని సినిమాల‌కు న‌ష్టాలొచ్చేది చాలా త‌క్కువ‌. నాని సినిమాల‌కు థియేట్రిక‌ల్‌తో పాటూ నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా బాగా జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అన్ని ర‌కాల బిజినెస్ లు ప‌క్కాగా జ‌రిగే హీరో నాని అనే చెప్తున్నారు. అందుకే త‌న‌తో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్ నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే నానితో ఒక సినిమా చేసిన టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ఒక‌రు మ‌రో సినిమా చేయాల‌ని నాని కోసం ఎప్ప‌టినుంచో ట్రై చేస్తున్నార‌ట‌. కానీ నాని మాత్రం ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. మ‌రో యంగ్ ప్రొడ్యూస‌ర్ కూడా నానితో సినిమా తీయాల‌ని చూస్తున్నారు. వీరిద్ద‌రే కాదు నానితో వ‌ర్క్ చేయ‌డానికి మ‌రో ఇద్ద‌రు ముగ్గురు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి నాని వారిలో ఎవ‌రితో సినిమా చేస్తాడో చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :