ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ డైరెక్ట‌ర్‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చిన నాగశౌర్య‌

ఆ డైరెక్ట‌ర్‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చిన నాగశౌర్య‌

2018 త‌ర్వాత నాగ‌శౌర్య‌కు మ‌ళ్లీ ఆ స్థాయి స‌క్సెస్ రాలేదు. ఓ బేబీ సినిమా మంచి హిట్ అయిన‌ప్ప‌టికీ ఆ హిట్ క్రెడిట్ స‌మంత అకౌంట్ లో ప‌డిపోయింది. త‌ర్వాత వ‌చ్చిన అశ్వ‌ద్ధామ ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ మంచి రిజ‌ల్ట్ అయితే రాలేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి ఫ్లాపులయ్యాయి.ఇక శౌర్య గ‌త చిత్రం రంగ‌బ‌లి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ బ‌సంశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మంచి అంచ‌నాల‌తో రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా డిజాస్ట‌ర్ అయింది. మాస్ ఎలిమెంట్స్, ఎంట‌ర్టైన్మెంట్ రెండూ క‌లిపి తీసిన ఈ సినిమాను ఆడియ‌న్స్ ను రిజెక్ట్ చేశారు. దీంతో శౌర్య ఈ మ‌ధ్య బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేశాడు.

గ‌త కొన్నేళ్లుగా స‌క్సెస్ కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న‌ప్ప‌టికీ అత‌నికి హిట్ మాత్రం అంద‌ని ద్రాక్ష‌లానే మారింది. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య హీరోగా చేస్తున్న రెండు సినిమాలు సెట్స్ పైనున్నాయి. కానీ వాటి అప్డేట్స్ కూడా ఈ మ‌ధ్య రావ‌డం లేదు. ఇదిలా ఉంటే నాగ‌శౌర్య త‌న గ‌త సినిమాను తీసిన రంగబ‌లి డైరెక్ట‌ర్ కు మ‌రో ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రంగ‌బ‌లి నిర్మాత సుధాక‌ర్ చెరుకూరినే ఈ సినిమాను కూడా నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈసారైనా ఈ కాంబో హిట్ అందుకుంటుందేమో చూడాలి. దీనిపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :