ASBL NSL Infratech

'మనమే' కంప్లీట్ డిఫరెంట్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ అందించే కమర్షియల్ ఎంటర్ టైనర్ : అబ్దుల్ వహాబ్

'మనమే' కంప్లీట్ డిఫరెంట్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ అందించే కమర్షియల్ ఎంటర్ టైనర్ : అబ్దుల్ వహాబ్

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

హాయ్ నాన్న తర్వాత మళ్ళీ పేరెంట్స్ చైల్డ్ నేపధ్యంలో 'మనమే' వస్తుంది కదా.. కథ పరంగా ఈ రెండు చిత్రాలు ఎలాంటి డిఫరెన్స్ వుంటుంది ?

- హాయ్ నాన్న, మనమే కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్స్. రెండు వేరు వేరు కథలు. ఈ రెండు సినిమాలకి ఎక్కడా కంపేరిజన్ లేదు. మనమే చాలా డిఫరెంట్ ఎమోషన్స్ వున్న కథ.  కథ గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చెయకూడదు. 'మనమే' ప్రోపర్ కమర్షియల్ ఫిల్మ్. ఇంత డిఫరెంట్ ఫిల్మ్ ని చేయడం ఇదే మొదటిసారి.

16 పాటలు వున్నాయని డైరెక్టర్ చెప్పారు. ఇందులో మ్యూజిక్ కి వున్న ప్రాముఖ్యత గురించి చెప్పండి?

- స్కోరింగ్ మొదలుపెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు చాలా స్మార్ట్. ఆయన సినిమాని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఇచ్చారు.  ఫస్ట్ హాఫ్ కంపోజ్ చేసినప్పుడే దాదాపు పది పాటలు వరకూ వచ్చాయి. సెకండ్ హాఫ్ కి మరో ఆరు పాటలు అవసరం అవుతాయని భావించాం. సినిమా కోసం16 పాటలు చేయడం నాకు ఇదే తొలిసారి.11 ప్రోపర్ సాంగ్ ట్రాక్స్. మరో ఐదు డిప్, బిట్ సాంగ్స్ గా వస్తాయి.

మీ కెరీర్ లో చాలా వరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయడం ఎలా అనిపించింది ?

- ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ తో రావడం గాడ్ బ్లెస్సింగ్స్ గా భావిస్తాను. ఖుషి, హాయ్ నాన్న మ్యూజిక్ ని ఆడియన్స్ చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మనమే వస్తుంది. మనమే లో నా కంప్లీట్ మ్యూజిక్ నాలెడ్జ్ ని ఎక్స్ ప్రెషన్ చేయడానికి అవకాశం దక్కింది. చాలా ఇష్టంగా ఈ ప్రాజెక్ట్ చేశాను. నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాము.

మీరు ప్రతి సినిమాకి ఎదో కొత్తగా ప్రయత్నిస్తారు. మనమే లో ఎలాంటి కొత్తదనం వుంటుంది ?

-మనమే లో అడిషినల్ గా నెంబర్ అఫ్ సాంగ్స్ వచ్చాయి. సీన్స్, మాంటజస్ ని సాంగ్స్ ద్వారా బ్యూటీఫుల్ గా చెప్పడం జరిగింది. దర్శకుడు శ్రీరామ్ నాకు చాలా ఇన్స్ స్పైర్ చేశారు. మనమే మ్యూజికల్ ఫిల్మ్. ఇన్ని పాటలు చేయడం నాకూ ఒక ఎక్స్పరిమెంట్ లా అనిపించింది. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. కథకు అనుగుణంగానే పాటలు వస్తాయి. సాంగ్స్ నెరేటివ్ ని ఇంకా వండర్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తాయి.

16 పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి ?

-పర్శనల్ గా నాకు అన్ని ట్రాక్స్ ఇష్టమే. కొన్ని పాటలు మనసుకి చాలా దగ్గరగా వుంటాయి. మనమే చాలా యంగేజింగ్ గా వుంటుంది. గ్రేట్, న్యూ ఎక్స్ పీరియన్స్. సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సినిమా చూసే వుంటారు.. శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ?

- శర్వానంద్ గారి వన్ అఫ్ ది బెస్ట్, క్లాసీ పెర్ఫార్మెన్స్ మనమే. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య అద్భుతంగా నటించారు. ఇందులో ఇంకొన్ని బ్యూటీఫుల్ క్యారెక్టర్స్ వున్నాయి. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా వుంటుంది ?

-బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనమే లో గ్రేట్ మ్యజికల్ ఎక్స్ పీరియన్స్. దాదాపు రెండు నెలలు స్కోర్ కోసం పని చేశాం. మనమే కంప్లీట్ డిఫరెంట్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ ని సీట్లో అతుక్కునేలా చేస్తాయి.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల గురించి ?

-చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ ని చాలా గ్రాండ్ గా చేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా లావిష్ గా నిర్మించారు.  

మీరు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో పని చేస్తారు కదా.. తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది ?

-ప్రతి టెక్నిషియన్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వన్ అఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. ఈ పరిశ్రమలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇక్కడ మ్యూజిక్ ని ఆడియన్స్  గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబద్ నా సెకండ్ హోమ్. ఇక్కడ చాలా గౌరవంగా ప్రేమగా చూస్తారు.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?

-రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వర్క్ చేస్తున్నాను.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :