ASBL NSL Infratech

ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీధర్ బాబు

ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే, హరీశ్‌ రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతోంది. మేం తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తాం. మూడు నెలల పరిపాలన చేయగానే, ఎలక్షన్‌ కోడ్‌ వచ్చింది. ఇప్పుడే కోడ్‌ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదు. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశ వర్కర్లను తొక్కించారు. పెద్దపళ్లిలో జరిగిన ఘటన పై విచారణ జరుగుతుంది. ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కుపాదంతో అణచివేస్తాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :