టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలో.. మినీ మహానాడు
అయిదేళ్ల జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడారని జర్మనీలోని తెలుగువారు పేర్కొన్నారు. టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వేడుకలు నిర్వహించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది ఎన్నారైలు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ఏపీకి వచ్చి ఎన్డీయే అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే అసాధారణ విజయం సాధించిందని కొనియాడారు. జగన్‌లా ప్రతీకారం తీర్చుకొనే మనస్తత్వం చంద్రబాబుది కాదని టీడీపీ నేత కావలి గ్రీష్మ తెలిపారు. టీడీపీ ఎన్నారై విభాగం కోర్ కమిటీ సభ్యుడు కుర్ర పవన్, బి.శివ, ఎస్.సుమంత్, దాసరి వంశీ, మహిళలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు.