ASBL Koncept Ambience
facebook whatsapp X

కాలిఫోర్నియా యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో.... ఇదే మొదటిసారి

కాలిఫోర్నియా యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో.... ఇదే మొదటిసారి

పాలస్తీనియన్లకు సంఫీుభావంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది క్యాంపస్‌లో నిరసనలతో హోరెత్తిస్తున్న నేపథ్యంలో జో బైడెన్‌ ప్రభుత్వం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రస్తుత ఛాన్సలర్‌ జెన్‌ బ్లాక్‌ను తొలగించి ఆయన స్థానంలో జులియో ఫ్రెంక్‌ అనే కొత్త వ్యక్తిని నియమించింది. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై బ్లాక్‌ సరిగా వ్యవహరించలేదన్న కారణంతో ఆయనపై వేటు వేసింది. ఇటువంటి కారణంతో ఛాన్సరల్‌ ఉద్వాసనకు గురవడం యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. మియామి యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న జులియో ఫ్రెంక్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ చాన్సలర్‌ పదవిని అధిష్టించిన మొదటి లాటినో కూడా. ఫ్రెంక్‌ అమెరికా పౌరుడే అయినప్పటికీ నిజానికి ఆయన మెక్సికో నుంచి వచ్చి అమెరికాలో పబ్లిక్‌ హెల్త్‌పై రిసెర్చి చేశాడు. ప్రపంచంలోనే టాప్‌ రిసెర్చి యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉందని ఫ్రెంక్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనాకు సంఫీుభావంగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మూడవసారి టెంట్‌ వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :