ASBL Koncept Ambience
facebook whatsapp X

వెంకీ మూవీ రిలీజ్‌పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి

వెంకీ మూవీ రిలీజ్‌పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి

అనిల్ రావిపూడి(Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్(Venkatesh) హీరోగా దిల్ రాజు(dil Raju) బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న వెంకీ76(Venky76) మూవీకి రీసెంట్ గా సంక్రాంతికి వ‌స్తున్నాం(Sankrantiki Vastunnam) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేక‌ర్స్. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండ‌టం కొంత‌మందికి రుచించ‌డం లేదు. గేమ్ ఛేంజ‌ర్(Game Changer) కోసం విశ్వంభ‌ర(Viswambhara)ను వాయిదా వేయించిన దిల్ రాజు త‌న బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న వెంకీ సినిమాను ఎందుకు ఎందుకు వాయిదా వేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే సంక్రాంతికి వ‌స్తున్నాం అనే టైటిల్ పెట్టుకుని వేరే సీజ‌న్ కు వ‌స్తే బావుండ‌ద‌నేది డైరెక్ట‌ర్ వెర్ష‌న్. పండ‌గ సీజ‌న్ ను మిస్ కాకూడ‌ద‌ని కావాల‌నే ఈ టైటిల్ ను పెట్టార‌నే కామెంట్స్ కూడా మెగా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇక్క‌డ ఓ విష‌యం గుర్తు చేసుకోవాలి. అనిల్ రావిపూడి- వెంకీ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్పుడే దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న‌ట్లు చెప్పారు.

అప్ప‌టికి గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ డేట్ ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. మొద‌టినుంచి గేమ్ ఛేంజ‌ర్ ను డిసెంబ‌ర్ అనే అనుకున్నారు కానీ సడెన్ గా డెసిష‌న్ మార్చుకుని జ‌న‌వ‌రి 10కి వెళ్ల‌డంతో ఇప్పుడు సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాకు చిక్కొచ్చింది. ఏదేమైనా ఒకే సీజ‌న్ లో రెండు పెద్ద హీరోల సినిమాల‌ను రిలీజ్ చేయ‌డానికి ఇద్ద‌రికీ కావాల్సిన‌న్ని థియేట‌ర్లు ఇవ్వ‌డానికి దిల్ రాజు చాలా పెద్ద ప్లాన్లే చేయాలి. ఈ రెండింటికి తోడు వేరే సినిమాలు కూడా రిలీజవుతున్నాయి కాబ‌ట్టి దిల్ రాజు ప్ర‌మోష‌న్స్ గ‌ట్టిగా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :