మరోసారి గురూజీతో మహేష్
గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో తన 29వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 3 ఏళ్ల పాటూ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేశాక ప్రతీ హీరోకూ క్రేజ్ ఓ రేంజ్ లో పెరుగుతూంటుంది. అలాంటి పరిస్థితుల్లో మహేష్ నెక్ట్స్ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వారి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తనకు మంచి పేరు తీసుకురావడంతో మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట మహేష్. త్రివిక్రమ్ కూడా మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో చూపించడానికి రెడీ అవుతున్నాడంటున్నారు.