ASBL Koncept Ambience
facebook whatsapp X

లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం ఎక్కువైపోయింది. ఓటీటీ ల పుణ్యమా అని పరభాష చిత్రాలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ సంతరించుకుంది. నిజానికి ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది కానీ ఎప్పుడు మాత్రం ఇది బాగా ఎక్కువ అవ్వడం తో పక్క ఇండస్ట్రీ నుంచి నటులు డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతున్న హీరో దుల్కర్ సల్మాన్. 

తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి.. దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రం తెలుగులో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిగిలిన భాషల్లో మాంచి స్పీడుతో ముందుకు పోతోంది. ఆర్థిక స్కాముల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీతో దుల్కర్ సల్మాన్ మరొక హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ సుమారు 60 కోట్ల గ్రోస్ ను అందుకుందని ట్రేడ్ వర్గాల టాక్. మహానటి, సీతారామం చిత్రాల సక్సెస్ తర్వాత తెలుగులో ఇది దుల్కర్ అందుకున్న మూడవ హిట్. అయితే ఈ చిత్రం అప్పుడే ఓటీటీ లో విడుదలకు సిద్ధమవుతోంది అని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అన్ని సినిమా లాగా ఈ చిత్రం నెలలోపే ఓటీటీ లోకి వచ్చే ఛాన్స్ ఉందట. 

ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ అందుకున్న ఈ చిత్రం పై పండక్కి వచ్చిన మిగిలిన సినిమాల ప్రభావం పడడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అందుకే అనుకున్న రేంజ్ లో తెలుగులో ఈ చిత్రానికి వసూలు రాలేకపోయాయి. ఏ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది.ఈ చిత్రం నవంబర్ 27 లేక 28 ప్రాంతంలో ఓటిటిలో వచ్చేస్తుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :