ASBL Koncept Ambience
facebook whatsapp X

మంత్రి శ్రీధర్ బాబు తో కొరియన్ ప్రతినిధుల భేటీ

మంత్రి శ్రీధర్ బాబు తో కొరియన్ ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌, ఈవీలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్లపై పాలసీలు తీసుకొస్తామన్నారు. మాదాపూర్‌లో నిర్వహించిన కొరియా-ఇండియా ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ ఫోరం 2024 సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులకు తెలంగాణను తొలి గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అనేక కొరియన్‌ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్రీడా దుస్తులు తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. తద్వారా 12 వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొరియన్‌ అంకుర సంస్థలకు అవకాశాలు కల్పించేందుకు దక్షిణ కొరియాతో టీ`హబ్‌ ఒప్పందం చేసుకుంది. కొరియన్‌ పెట్టుబడిదారుల కోసం ఇన్వెస్ట్‌ తెలంగాణ సెల్‌ పేరిట ప్రత్యేక డెస్‌ ప్రారంభించనున్నాం.  మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో అవసరమైతే కొరియన్‌ కంపెనీల సహకారం తీసుకుంటాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :