ASBL Koncept Ambience
facebook whatsapp X

సందీప్ టైమ్ ను వేస్ట్ చేసిన హీరోలెవ‌రు?

సందీప్ టైమ్ ను వేస్ట్ చేసిన హీరోలెవ‌రు?

సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చేసింది మూడు సినిమాలే అయినప్ప‌టికీ ఇప్పుడు అత‌ను ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. అత‌నితో సినిమా చేయాల‌ని స్టార్ హీరోలు సైతం ఆస‌క్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas), సందీప్ తో స్పిరిట్(Spirit) చేయడానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంత క్రేజ్ సంపాదించుకున్న సందీప్ త‌న మొద‌టి సినిమా అర్జున్ రెడ్డి(Arjun Reddy)కి ముందు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాడు.

అర్జున్ రెడ్డి క‌థ‌ను సినిమాగా చేయ‌డానికి అత‌ను ప‌డిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ ఇబ్బందుల గురించి తాజాగా స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్(Kona venkat) ఓ పాడ్‌కాస్ట్ లో చెప్పాడు. అర్జున్ రెడ్డి కోసం సందీప్ ఐదేళ్లు ప‌ట్టుబ‌ట్టి కూర్చున్న‌ప్ప‌టికీ అది ప‌ట్టాలెక్క‌లేద‌ని కోన వెంక‌ట్ వెల్ల‌డించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ కంటే ముందు ఆ క‌థ‌ను ఓ హీరోకు చెప్ప‌గా ఆ క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపించాడ‌ని, తన ఆఫీస్ లో ఆ క‌థ మీద వ‌ర్క్ చేసే ఛాన్స్ ఇచ్చాడ‌ని కోన తెలిపాడు.

మూడేళ్ల పాటూ ఆ హీరో సినిమా చేద్దాం చేద్దాం అంటూ కాల‌క్షేపం చేశాడ‌ని, అత‌నికి సినిమా చేసే ఉద్దేశం లేద‌ని చివ‌ర‌కు అర్థ‌మై సందీప్ అక్క‌డి నుంచి బ‌య‌టికొచ్చేశాడ‌ని తెలిపాడు. ఆ త‌ర్వాత మ‌రో హీరో ఆ స్టోరీపై ఇంట్రెస్ట్ చూపించి మ‌రో రెండేళ్ల పాటూ వెనుక తిప్పించుకుని చివ‌ర‌కు హ్యాండ్ ఇచ్చాడ‌ని చెప్పాడు. చివ‌ర‌కి సందీప్ క‌ష్టం చూడ‌లేక త‌న అన్న‌య్యే డ‌బ్బులు పెట్టి సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ని, ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశాడ‌ని, సందీప్ ను న‌మ్మి విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్లే అర్జున్ రెడ్డి సినిమా తీయ‌గ‌లిగిన‌ట్లు కోన వెంక‌ట్ చెప్పాడు. కోన వెంక‌ట్ మాట్లాడిన ఈ మాట‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :