మరో సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్న కిరణ్
మీటర్(Meter), రూల్స్ రంజన్(Rules Ranjan) లాంటి సినిమాలతో వరుస ఫ్లాపులను అందుకున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తన డిజాస్టర్ స్ట్రీక్ కు క(Ka) సినిమాతో హిట్ కొట్టి తెర దించాడు. ముందు నుంచి క సినిమాను ఎంతో నమ్మిన కిరణ్ తన నమ్మకం నిజమని నిరూపించాడు. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకుని ఘన విజయం సాధించింది.
సెకండ్ వీక్ లో కూడా క సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా క సినిమా రిలీజ్ కానుంది. క సక్సెస్ ఇచ్చిన జోష్ తో కిరణ్ మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అదే దిల్ రూబా(Dil ruba). విశ్వ కరుణ్(Viswa Karun) అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్(Ruksar Thillon) హీరోయిన్ గా నటించింది.
వాస్తవానికి క సినిమా కంటే ముందుగా ఇదే రిలీజవ్వాల్సింది కానీ క సినిమాపై ఉన్న నమ్మకంతో దీన్ని హోల్డ్ లో పెట్టాడు కిరణ్. దిల్ రూబా ప్రేమ కథ కావడంతో దీన్ని ముందు రిలీజ్ చేస్తే ఆడియన్స్ పట్టించుకోరని, బిజినెస్ కూడా పెద్దగా జరగదని భావించి క సినిమాను ముందు రిలీజ్ చేసి హిట్ అందుకున్నాడు. కిరణ్ అనుకున్నట్లే క సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో ఇప్పుడు దిల్ రూబాకు మంచి బిజినెస్ జరిగే అవకాశముంది. బిజినెస్ పూర్తయ్యాక దిల్ రూబా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.