కల్కి ట్రైలర్ టాక్
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడి. గత మూడు నెలలుగా సరైన సినిమా లేక దేశం మొత్తం థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగలిగే సినిమా కల్కినే అని అందరూ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి కిందటే రిలీజ్ అయింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కట్ ఎంతో గొప్పగా ఉంది. ట్రైలర్ చూశాక అందరూ రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఈ సినిమాకు ఉందంటున్నారు. కాశీ మీద దుష్టశక్తుల కళ్లు పడటంతో లోక రక్షణ కోసం దేనికైనా తెగించే అశ్వద్ధామ (అమితాబ్) ఒక ప్రాణిని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు.
దానికి భైరవ (ప్రభాస్) సాయం కావాల్సి వస్తుంది. కాలంతో పాటూ ట్రావెల్ చేసే బుజ్జి అనే వాహనాన్ని తోడుగా తీసుకుని భైరవ లక్ష్యం వైపు వెళ్తాడు. లోక కళ్యాణం కోసం దొరక్కుండా ఉన్న అమ్మాయి (దీపికా)ను తీసుకొచ్చే బాధ్యత భైరవ మీద ఉంటుంది. కలియుగాంతం నుంచి కల్కి అవతారం వరకు వేల సంవత్సరాల మధ్యలో అసలేం జరిగిందన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. నాగ్ అశ్విన్ ప్రపంచం మూడు నిమిషాలకే టెర్రిఫిక్ గా అనిపిస్తే ఇక సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ వేరే లోకంలోకి వెళ్లడం ఖాయం. ప్రభాస్ ఇంట్రో, అమితాబ్ ఎలివేషన్స్, కమల్ గెటప్ అన్నీ కల్కిపై ఆడియన్స్ కు అంచనాలను పెంచుతున్నాయి. కల్కి లోకంలోకి వెళ్లాలంటే ఆడియన్స్ జూన్ 27 వరకు ఆగాల్సిందే.