జాన్వీ గ్లామర్ తోనే మెప్పించేలా ఉందే!
శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ నటన పరంగా తల్లి క్రేజ్ ను అందుకోవడం కష్టమే కానీ గ్లామర్ విషయంలో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో ఆడియన్స్ కు కన్నులవిందు కలిగించే జాన్వీ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక మిగిలిందంతా నటిగా తనదైన ముద్ర వేయడమే. అయితే జాన్వీ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ధడక్ తప్ప మిగిలినవేవీ పెద్దగా ఆడలేదు. రీసెంట్ గా రిలీజైన ఉలఝ్ కూడా డిజాస్టర్ అయింది. బాలీవుడ్ లో జాన్వీకి ఎలాంటి ట్రాక్ రికార్డున్నప్పటికీ టాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. వినడానికి సొంపుగా ఉన్న ఈ సాంగ్ విజువల్ గా కూడా ఎంతో బావుంది. పాటలో ఎన్టీఆర్ కంటే కూడా జాన్వీనే ఎక్కువ హైలైట్ అయింది. దానికి జాన్వీ గ్లామరే కారణం. లంగాఓణీ లోనే కాకుండా దేవకన్య డ్రెస్ లో కూడా జాన్వీ వావ్ అనిపించింది. విజువల్స్ చూస్తే డైరెక్టర్, కెమెరామెన్ జాన్వీ గ్లామర్ మీద బాగా ఫోకస్ చేశారని అర్థమవుతుంది. ఈ సాంగ్ రిలీజయ్యాక జాన్వీ పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. పాటతో తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన జాన్వీ నటనతో కూడా మెప్పిస్తే టాలీవుడ్ లో అమ్మడికి లాంగ్ కెరీర్ ఉండటం ఖాయం.