ASBL Koncept Ambience
facebook whatsapp X

శర్వానంద్ #Sharwa37 నుంచి నిత్యగా సాక్షి వైద్య పరిచయం

శర్వానంద్ #Sharwa37 నుంచి నిత్యగా సాక్షి వైద్య పరిచయం

చార్మింగ్ స్టార్ శర్వానంద్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ అప్ లో ఉంచారు.  ఇటీవల 'మనమే'తో అలరించిన శర్వా ఇప్పుడు తన నెక్స్ట్ 37వ సినిమా  షూటింగ్‌లో బిజీగా వున్నారు. సెన్సేషనల్ హిట్ సామజవరగమన ని అందించిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ ఎంటర్టైనింగ్  మూవీని  నిర్మిస్తున్నారు.

మేకర్స్ ఈ రోజు వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాక్షి వైద్యను బోర్డులోకి స్వాగతించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెను నిత్యగా  పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తుంది.  శర్వాతో జతకడుతోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. భాను బోగవరపు కథ అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :