ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ

ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నామినేట్‌ పదవుల జాబితా విడుదలైంది. నామినేటేడ్‌ పదవుల సెకెండ్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కల్చరల్‌ కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా తేజస్వి పొడపాటి, ఆంధ్రప్రదేశ్‌ నాట అకాడమి చైర్మన్‌గా తిరిగి గుమ్మడి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తేజస్వి చురుకైన కార్యకర్త ఉంటూ పార్టీకి అండగా చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఆకుట్టుకుంది. తెలుగుదేశం పార్టీ క్లిష్ట సమయంలో తనదైన పోరాటం చేసి ఉనికి చాటుకుంది. దశ దిశ తెలిసిన తేజస్వి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ కళాకారులకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. 

గుమ్మడి గోపాలకృష్ణ గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ అదే పదవి ఆయన్ని వరించింది. నాట రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. పద్య నాటకాన్ని అమెరికాలో ప్రాచుర్యం కల్పిస్తూ అక్కడ ఎందరో చిన్నారులకు పద్యం నేర్పించి నాటకాలు ప్రదర్శించే స్థాయికి చేర్చిన గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ నాట రంగం అభివృద్ధి చెందుతుది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండి పద్యాలు స్వయంగా రాసి పాడి ప్రజల్లోకి పంపించి ప్రచారంలో సాంస్కృతిక కార్యక్రమాల పరంగా కీలక పాత్ర పోషించారు. గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్‌ ద్వారా పేద కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు.

 

 


 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :