దామగుండంలో15న నేవీ రాడార్‌స్టేషన్ శంకుస్థాపన
దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం (Indian Navy) వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ గారు, నేవీ ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Tags :