ASBL Koncept Ambience
facebook whatsapp X

గ్రెచెన్ ప్రపంచ రికార్డు

గ్రెచెన్ ప్రపంచ రికార్డు

మహిళల స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. యుఎస్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌లో గ్రెచెన్‌ వాల్ష్‌ 100 మీటర్ల బటర్‌ఫ్లై సెమీస్‌లో 55.18 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2016 రియో ఒలింపిక్స్‌లో సారా (స్వీడన్‌, 55.48 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. 21 ఏళ్ల వాల్ష్‌ ఇంకా అమెరికా ఒలింపిక్‌ జట్టులోకి ఎంపిక కాలేదు. ఫైనల్లోనూ సత్తా చాటితే ఆమె పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. తుదిపోరులో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన టోరీ  హస్కె, రెగాన్‌ స్మిత్‌, క్లైయిర్‌ కజాన్‌ నుంచి గ్రెచెన్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :