ASBL Koncept Ambience
facebook whatsapp X

మంజు భార్గవికీ ధైర్య అవార్డు 

మంజు భార్గవికీ ధైర్య అవార్డు 

అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ  తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు విచ్చేసి శంకరాభరణం ఫేమ్, "శ్రీమతి మంజు భార్గవి గారిని సత్కరించి వారికి ధైర్య పురస్కారాన్ని అందించారు., మరియు తమ విలువైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా కిరణ్, టీడీపీ నేత ప్రోఫిసర్ జ్యోత్స్న తిరునగరి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ గారు, సంస్థ ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగాయి.

 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :