ASBL Koncept Ambience
facebook whatsapp X

రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటికి భూకేటాయింపు కార్యక్రమం 

రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటికి భూకేటాయింపు కార్యక్రమం 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1100 మంది జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కేటాయింపు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్రభారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. 

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది.వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు....అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి.

కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు.

నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నాను. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నాను. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం.

 

- జి.సురేందర్, భూవిజన్ న్యూస్

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :