ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చర్చలు : చంద్రబాబు
ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థలను, పెట్టుబడులను రాష్ట్రానికి పెద్ద ఎత్తున తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ప్రకటించారు. వారిద్దరితో ఆన్‌లైన్‌లో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాలపైనా వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.
Tags :