ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభం

ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ జీర్ణించుకోలేని విధంగా ఓటమిని చవి చూసింది. కూటమి పార్టీలు కూడా గెలుస్తాం అనే ధీమాతో ఉన్నాయి కానీ ఈ స్థాయిలో విజయం దక్కుతుందని మాత్రం కలగనలేదు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు గురించే.! ఆయన రాజకీయ అనుభవం, ఎప్పటికప్పుడు తను తీసుకున్న నిర్ణయాలు ఈరోజు టీడీపీని మరోసారి విజయతీరాలకు చేర్చాయి. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి.  ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయంతోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24మంది చేత గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. 

కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ-కలకత్తా రహదారిలో ఎటు చూసినా జనాలే కనిపించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు.. నడుస్తూ వచ్చేవారు.. ఇలా లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.  

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌ జస్టీస్‌ ఎన్వీ రమణ, చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులతోపాటు రాంచరణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త కేబినెట్‌ లో జనసేన నుంచి ముగ్గురికి మంత్రిపదవులు దక్కగా.. బీజేపీ నుంచి ఒకరిని మంత్రిపదవి వరించింది. ఇందులో భాగంగా.. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ తో పాటు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ లకు అవకాశం దక్కింది. ఇక బీజేపీ విషయానికొస్తే... ఆ పార్టీ నుంచి సత్యకుమార్‌ యాదవ్‌ కు ఛాన్స్‌ దక్కింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం చేసిన వారిలో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం.  

ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో ముగ్గురు మహిళా నాయకులు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ముగ్గురూ కూడా.. ఒక్కొక్కరు ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒకరు ఎస్సీ, మరొకరు ఎస్టీ, ఇంకోకరు బీసీ కావడం విశేషం. అంతేకాదు.. ఈ ముగ్గురు మహిళా నూతన మంత్రులు కూడా వైసీపీకి చెందిన మంత్రులను ఓడిరచి.. మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇది మరో రికార్డు. అనిత వంగలపూడి. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దీంతో 2014లో పాయకరావుపేట టికెట్‌ ఇచ్చారు. అప్పట్లో ఆమె విజయం దక్కించుకున్నారు. 2019లో నియోజకవర్గం మార్చడంతో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. వైసీపీ నేత కంబాల జోగులును ఓడిరచి.. మంత్రి పీఠం దక్కించుకున్నారు. గుమ్మడి సంధ్యారాణి. విజయనగరం జిల్లాలోని సాలూరు  నియోజకవర్గం నుంచి విజయం దక్కించు కున్నారు. టీడీపీలో సీనియర్‌ నాయకురాలైన ఆమె.. ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి అయ్యారు. వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13వేల ఓట్ల మెజారిటీతో సంధ్యారాణి విజయం దక్కించుకున్నారు. 

ఎస్‌.సవిత. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన %దీజ% కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. తొలిసారి ఆమె పోటీ చేసినా విజయం అందుకున్నారు. పెనుకొండలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్‌ను ఓడిరచారు. ఇలా ముగ్గురు మహిళా మంత్రులకు ప్రత్యేకత ఉండడం గమనార్హం.

బాబు రికార్డు

నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అభవిక్త ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు సీఎంగా ఎన్టీఆర్‌ హిస్టరీ సృష్టిస్తే%ౌ% ఆ తరువాత నీలం సంజీవ రెడ్డి, మర్రి చెన్నా రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డిరెండు సార్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇక తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్థనరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఓ రికార్డు కాగా.. ఆయన మంత్రి మండలి కూడా నయా చరిత్రను సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయటంతో.. సీబీఎన్‌ 4.0 రికార్డు ఆయన సొంతమైంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :