ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్రీరెడ్డిపై కేసు..! నెక్స్ట్ టార్గెట్ ఆర్జీవీ, పోసాని..!?

శ్రీరెడ్డిపై కేసు..! నెక్స్ట్ టార్గెట్ ఆర్జీవీ, పోసాని..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కొంతమంది రెచ్చిపోయి ప్రవర్తించారు. టీడీపీ, జనసేనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. విమర్శల వరకూ పరిమితం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత దూషణలకు దిగారు. కుటుంబ సభ్యులను లాగి వాళ్లపైన కూడా సెటర్లు వేశారు. అలాంటి వాళ్లలో శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు ముందున్నారు. వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న వీళ్లు టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేస్తూ రోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అధికారంలోకి వస్తే వీళ్ల సంగతి చూడాలని అప్పట్లోనే టీడీపీ, జనసేన నేతలు కంకణం కట్టుకున్నారు.

వైసీపీకి ఓటమనేదే ఉండదని.. మళ్లీ జగనే గెలుస్తాడనే నమ్మకంతో చాలా మంది వైసీపీ నేతలుండేవారు. అయితే ఆయనకు మద్దతుగా నిలిచిన పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా వైసీపీ కార్యకర్తల్లాగే ప్రవర్తించారు. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు వైసీపీ కార్యకర్తలు కాదు.. నేతలు కూడా కాదు. వాళ్లు ఎప్పుడూ కండువా కప్పుకోలేదు. అయినా వైసీపీ తరపున పని చేశారు. ఆ పార్టీకి మద్దతుగా పోస్టులు పెట్టారు. మద్దతుగా ప్రచారం చేయడం తప్పుకాదు. కానీ వీళ్లు ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనను టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వ్యక్తిగత పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా చేపట్టారు. అయితే ఆయన ప్రెస్ మీట్లలో పవన్ కల్యాణ్, చిరంజీవి టార్గెట్ గా వ్యక్తిగత దూషణలు చేశారు.

ఇప్పుడు ఇలాంటి వాళ్లందరి పని పట్టేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు వీళ్లు నోరు జారతారా అని వెయిట్ చేస్తోంది. ఈ ఉచ్చులో చిక్కుకుంది శ్రీరెడ్డి. జగన్ ఓడిపోయిన తర్వాత కూడా శ్రీరెడ్డి జోరు ఏమాత్రం తగ్గలేదు. టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. తాజాగా పవన్ కల్యాణ్, చంద్రబాబుపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో ఆమెపై ఫోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కర్నూలు జిల్లాలో ఆమెపై పోలీసులు కేసు పెట్టారు. దీంతో ఆమె అరెస్టు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆమెపై కేసు నమోదయిందని తెలియగానే నెక్స్ట్ ఆర్జీవీ, పోసాని పని పట్టాలనే డిమాండ్ జనసైనికుల నుంచి వినిపిస్తోంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్జీవీ ఎక్కువగా పవన్ కల్యాణ్, లోకేశ్ లను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే వాళ్లిద్దరూ ఆర్జీవీని పెద్దగా పట్టించుకోలేదు. మరీ చిల్లరగా బిహేవ్ చేస్తున్నారని లైట్ తీసుకున్నారు. వైసీపీ ఓడిపోగానే ఆర్జీవీ కూడా ప్లేట్ ఫిరాయించేశాడు. ఇక రాజకీయాల జోలికి పోనని చెప్పేశాడు. అప్పటి నుంచి ఎవరిపైనా కామెంట్స్ చేయట్లేదు. ఇక పోసాని కూడా వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి బయటకు రాలేదు. ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దీంతో వీళ్లిద్దరూ ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే ఆర్జీవీకి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో కొంతమొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. దానిపై విచారణ జరిపిస్తామని అప్పట్లోనే టీడీపీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ అది అక్రమమని తేలితే ఆర్జీవీ కూడా విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఖాయం. సో.. ఇప్పటికీ ఆర్జీవీపై కత్తి వేలాడుతూనే ఉందన్నమాట.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :