ASBL Koncept Ambience
facebook whatsapp X

భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో : అమెరికా

భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో : అమెరికా

భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలను ఇవ్వనున్నామని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. గత ఏడాది 1,40,000 వీసాలు ఇచ్చామని, ఈసారి ఆ రికార్డును తిరగరాసేవాలాగానీ, దానికి సమానంగా ఉండేలా గానీ ఇస్తామని పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలలో 8వ విద్యార్థి వీసా దినోత్సవాన్ని రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ సందర్భంగా ఢిల్లీ తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ సయ్యద్‌ ముజ్తాబా అంద్రాబీ మాట్లాడారు.  ఒక్కరోజే  4,000 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని తెలిపారు. సాధారణంగా ఈ సీజనుకు విద్యార్థి వీసాలను జూన్‌ నుంచి ఇస్తామని, కానీ ఈసారి మే నెలలోనే  ప్రారంభించామని, ఇది ఆగస్టు ఆఖరు వరకూ కొనసాగుతుందని వెల్లడిరచారు. బీ1, బీ2 వీసాకు కొత్తగా దరఖాస్తు చేసేవారికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూకు వేచి ఉండే సమయాన్ని పూర్తిగా తగ్గించామని పేర్కొన్నారు. బీ1, బీ2 వీసాలకు వేచి ఉండే సమయమూ 70 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. అమెరికాలో 4,500 అక్రిడిటేటెడ్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :