ASBL NSL Infratech

రివ్యూ : "భజే వాయు వేగం" థ్రిల్లింగ్ స్పీడ్ మూవీ

రివ్యూ : "భజే వాయు వేగం" థ్రిల్లింగ్ స్పీడ్ మూవీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్,
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు
సంగీత దర్శకుడు : రధన్, కపిల్ కుమార్ జమ్ముల
సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్, ఎడిటింగ్: సత్య జి
మాటలు: మధు శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్
సహా నిర్మాత : అజయ్ కుమార్ రాజు.పి
నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్, దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
విడుదల తేదీ : 31.05.2024
నిడివి : 2 ఘంటల 23 నిముషాలు

'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఆ తర్వాత సరైన హిట్  లేక ఇబ్బంది పడుతున్నాడు. వరుస పరాజయాల తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన సినిమా.. భజే వాయు వేగం. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి 'యువి' సంస్థలో రూపొందించిన ఈ చిత్రం నిన్న శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ సాలిడ్ యాక్షన్ డ్రామానే ఇది.   మరి హిట్ కోసం కార్తికేయ నిరీక్షణకు ఈ చిత్రం తెరదించేలా ఉందా? మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

వరంగల్ లోని రాజన్న పేట గ్రామంలో వెంకట్ (కార్తికేయ) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కష్ట సమయంలో ఊర్లో వారి అప్పులని తీర్చి లక్ష్మయ్య (తనికెళ్ళ భరణి) వెంకట్ ని అక్కున చేర్చుకుంటారు. అయితే తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో సమానంగా పెంచి పోషిస్తారు. అయితే ఇద్దరినీ ఉన్నత స్థానాల్లో చూడాలని పెద్ద కొడుకు రాజుకి మంచి ఉద్యోగం, చిన్నోడు వెంకట్ ని క్రికెటర్ చెయ్యాలని తన తాహతుకు మించి కష్టపడతూ హైదరాబాద్ కి పంపిస్తారు. అయితే ఇంకో పక్క హైదరాబాద్ ని ఏలుతున్న ఇద్దరు అన్నతమ్ములు డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహితిస్వ) లు హైదరాబాద్ లోకి నాన్ లోకల్ గా వచ్చి కంట్రోల్ లో పెట్టుకుంటారు. అయితే ఇంత పవర్ఫుల్ వ్యక్తులకు అతి సామాన్యులు అయ్యిన వెంకట్, రాజులకి ఎలా ఘర్షణ మొదలవుతుంది? ఈ క్రమంలో లక్ష్మయ్య ని కాపాడుకోడానికి వీరేం చేస్తారు? హైదరాబాద్ లో రన్ అవుతున్న ఏ 56 డ్రగ్ రాకెట్ ని నడిపిస్తుంది ఎవరు? ఇందులో ఇందు (ఐశ్వర్య మీనన్) పాత్ర ఏంటి? అసలు వెంకట్, రాజు లు తమ తండ్రిని కాపాడుకోవడంలో ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

కార్తికేయ చాన్నాళ్లకు తనకు సూటయ్యే పాత్రను.. కథను సెలక్ట్ చేసుకున్నాడు. క్రికెటర్ కావాలని ఆశపడి.. ఆ కల నెరవేరక రాజీ పడుతూ బతికే కుర్రాడి పాత్రలో కార్తికేయ బాగా ఒదిగిపోయాడు. ఎప్పట్లాగే తన లుక్ బాగుంది. క్రికెటర్ పాత్రకు తగ్గట్లు ఫిట్ గా కనిపించాడు. యువ ప్రేక్షకులు మెచ్చేలా ఎనర్జిటిగ్గా సాగింది తన పాత్ర. హీరో అన్న పాత్రలో చాన్నాళ్ల తర్వాత 'హ్యాపీ డేస్' ఫేమ్ టైసన్ రాహుల్ తెరపై మెరిశాడు. భయం భయంగా బతికే కుర్రాడి పాత్రకు అతను సూటయ్యాడు. తన పాత్ర పట్ల ప్రేక్షకుల్లో జాలి కలిగేలా నటించాడు. హీరోయిన్ ఐశ్వర్యా మేనన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మోడర్న్ లుక్ లో కనిపించే ఆమె.. బస్తీ అమ్మాయి పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. హీరో ఫ్రెండు పాత్రలో సుదర్శన్ బాగానే చేశాడు. పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో ఎక్కువ మార్కులు దక్కించుకునేది మాత్రం విలన్ పాత్రలో చేసిన రవిశంకరే. తన వాయిస్ తోనే అతను విలనీ పండించాడు. నటన కూడా ఆకట్టుకుంటుంది. శరత్ లోహిత్స్వ కూడా తన పరిధిలో బాగానే నటించాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఇక సాంకేతిక విభాగంలో  దర్శకుడు ప్రశాంత్ రెడ్డి విషయానికి వస్తే.. తను మంచి డెబ్యూ ఇచ్చాడు అని చెప్పవచ్చు. మెయిన్ గా తను కథనం నడిపిన విధానం మెప్పిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ తాను సినిమాని ఆవిష్కరించిన విధానంలో ఎక్కడా ఇది తన తొలి సినిమాలా అనిపించకుండా తెరకెక్కించారు. ఆ లాజికల్ ఎర్రర్స్ ని కూడా కరెక్ట్ చేసుకుంటే తన నుంచి మరిన్ని బెటర్ సినిమాలు ఆశించవచ్చు. అయితే కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. చాలా సీక్వెన్స్ లలో యాక్షన్, ఎమోషన్ అయినా కూడా తన స్కోర్ తో మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేదు. రదన్ అందించిన ఒక్క పాట ఓకే అనిపిస్తుంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. నాచురల్ గా మంచి విజువల్స్ చూపించారు. సత్య జి ఎడిటింగ్ బాగుంది.  యూవీ కాన్సెప్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా భిన్నమైన అరంగేట్రం కోసం చూసే యువ దర్శకులు ఎక్కువగా ఎంచుకునేది క్రైమ్ కామెడీ లేదా క్రైమ్ తో ముడిపడ్డ యాక్షన్ థ్రిల్లర్. ఆకర్షణ అంతా ద్వితీయార్ధంలోనే ఉంది. గెస్సింగ్ లో ఉంచేలా కథ మలుపులు తిరుగుతూ సాగడం.. సన్నివేశాలు రయ్యిన పరుగెత్తడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. విలన్ పాత్రలో కొత్త కొత్త కోణాలను పరిచయం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివర్లో హీరో ఆడే గేమ్ కూడా మెప్పిస్తుంది. కొన్ని సీన్లు నాటకీయంగా అనిపించినా.. దాని గురించి ఎక్కువ ఆలోచించని విధంగా కథ పరుగులు పెట్టడంతో అది పెద్ద ఇబ్బంది కాదు. మరీ ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసేంత థ్రిల్లింగ్ సీన్లు లేకపోయినా.. ఓ మోస్తరుగా ఎంగేజ్ చేయడంలో 'భజే వాయు వేగం విజయవంతమైంది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “భజే వాయు వేగం” టైటిల్ కి తగ్గట్టే మాంచి యాక్షన్, రేసీ గా కనిపిస్తుంది. యాక్షన్, మాస్ మూమెంట్స్ అలాగే తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ని ఆశించేవారికి కూడా మంచి ట్రీట్ ఇస్తుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ పక్కన పెడితే మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :