ASBL Koncept Ambience
facebook whatsapp X

అడ్డంగా దొరికిపోయిన జగన్‌..! ఆటాడుకుంటున్న నేషనల్ మీడియా..!

అడ్డంగా దొరికిపోయిన జగన్‌..! ఆటాడుకుంటున్న నేషనల్ మీడియా..!

అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చెల్లుతాయి. ఒక్కసారి ఆ పవర్ పోయిందంటే పూచికపుల్ల కూడా వెక్కిరిస్తుందనే సామెత ఉంది. ఇప్పుడు సరిగ్గా ఇది జగన్ కు అతికినట్లు సరిపోతుంది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రాంతీయ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఆయనకు అండగా నిలిచింది. ఆయన హయాంలో నేషనల్ మీడియాకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇచ్చారు. జగన్ పాలనను పొగుడుతూ అనేక కథనాలను కూడా పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అంతెందుకు.. జగన్ మళ్లీ గెలుస్తున్నాడని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడించిన సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. జగన్ ఓడిపోగానే ఆయనకు వ్యతిరేకంగా కథనాలను వండి వారుస్తున్నాయి.

రుషికొండ భవనాల విషయంలో మాజీ సీఎం జగన్ అడ్డంగా బుక్ అయిపోయారు. ఆ భవనాలను ఆయన కోసమే కట్టారనే విషయం ఏపీలో అందరికీ తెలుసు. వైసీపీ నేతలు కవర్ చేసుకునేందుకు ఎన్ని మాటలు చెప్తున్నా వాటిని నమ్మేవాడెవడూ లేరు. పర్యాటక భవనాల కోసం అని, గెస్ట్ హౌస్ కోసం అని, కేంద్ర పెద్దలకోసం అని.. ఇలా ఒక్కోసారి ఒక్కోనేత ఒక్కోలా మాట్లాడడం వైసీపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. అన్నిటికీ మించి ఆ భవనాలు కడుతున్నప్పుడు అక్కడికి ఎవర్నీ అనుమతించకుండా గోప్యత ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..? ఇప్పుడు వైసీపీ ఓడి టీడీపీ అధికారంలోకి వచ్చింది.

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రుషికొండ భవనాల సంగతి తేల్చాలని భావించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అందర్నీ వెంటబెట్టుకుని రుషికొండ వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారందరికీ ఆ రిచ్ నెస్ చూసి కళ్లు బైర్లు కమ్మాయి. ఎవరికోసం ఇంత ధనం వెచ్చించి కట్టారని ప్రశ్నలు తలెత్తాయి. పర్యాటక భవనాలకోసం అయితే ఇలా కట్టాల్సిన అవసరం ఏముంది..? ప్రభుత్వ భవనాల కట్టడాలేవీ ఇలా కట్టరు.. మరి ఇలా ఎందుకు కట్టారు.. లాంటి అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. వైసీపీ వాళ్లు ఎన్ని చెప్పినా వాటిని ఎవరూ నమ్మలేదు. ఆఖరికి తమ సొంత సొత్తుగా భావించిన పలు జాతీయ మీడియా చానళ్లు కూడా నమ్మలేదు.

రుషికొండ భవనాలు, అందులోని గ్రాండియర్ ను చూసిన తర్వాత నేషనల్ మీడియా నోరెళ్లబెట్టింది. ఇది సద్దా హుస్సేన్, బకింగ్ హాం ప్యాలెస్ భవనాల్లాగా ఉందని అర్ణాబ్ గోస్వామి అభివర్ణించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికి 900 కోట్లు ఖర్చు పెట్టారని.. అలాంటి జగన్ నివాసం ఉండుందుకు 550 కోట్లు ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసిన వారిపై కేసు నమోదు చేసిన ఆ సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి జాతీయస్థాయిలో కూడా జగన్ బద్నాం అవుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :