ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ

ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :