ASBL NSL Infratech

రూ. 5 కోట్ల ఆఫ‌ర్ ను వ‌ద్ద‌న్న స్వీటీ

రూ. 5 కోట్ల ఆఫ‌ర్ ను వ‌ద్ద‌న్న స్వీటీ

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్వీటీ అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె స్క్రీన్ మీద క‌నిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ కూడా ఆమెకున్నారు. వాళ్ల కోస‌మే అనుష్క సినిమాలు చేస్తుంది. నిశ్శ‌బ్దం త‌ర్వాత సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న స్వీటీ గ‌తేడాది మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించి మంచి హిట్ అందుకుంది.

ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఘాటి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న అనుష్క‌, మ‌ల‌యాళంలో కూడా ఓ క్రేజీ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే అనుష్క‌కు ఈ మ‌ధ్య ఓ భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. కానీ ఆ ఆఫ‌ర్ ను అనుష్క సున్నితంగా రిజెక్ట్ చేసింద‌ట‌. ఓ స్టార్ డైరెక్ట‌ర్, స్టార్ హీరో కాంబోలో తెర‌కెక్క‌నున్న భారీ బ‌డ్జెట్ సినిమాలో హీరోయిన్ గా స్వీటీకి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌.

కానీ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో ఆ సినిమా చేయ‌డానికి అనుష్క మ‌న‌సు అంగీక‌రించక ఆ ఆఫ‌ర్ ను కాద‌న‌ట్లు తెలుస్తోంది. సుమారు రూ.5 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ప్ప‌టికీ అనుష్క ఆ సినిమాకు నో చెప్పేసింద‌ట‌. ఇక‌పై వ‌రుస సినిమాలు చేయాల‌నుకుంటున్న అనుష్క‌, లేడీ ఓరియెండెట్ సినిమాల‌తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయాల‌ని చూస్తోంది. ప్ర‌స్తుతం త‌న చేతిలో ఉన్న రెండు సినిమాల‌ను పూర్తి చేశాకే త‌ర్వాతి సినిమాల‌ను లైన్ లో పెట్టాల‌ని చూస్తుంద‌ట స్వీటీ.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :