ASBL Koncept Ambience
facebook whatsapp X

ఛాలెంజింగ్ మూవీ చేయ‌నున్న అఖిల్

ఛాలెంజింగ్ మూవీ చేయ‌నున్న అఖిల్

ఏజెంట్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఆ సినిమా కోసం అఖిల్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ కంటెంట్ లో స‌త్తా లేక‌పోవ‌డంతో అఖిల్ ప‌డిన క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరులా అయిపోయింది. దీంతో అఖిల్ త‌న త‌ర్వాతి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని ఎంతో క‌సితో ఉన్నాడు.

దానికి తగ్గట్టుగానే అఖిల్ నెక్ట్స్ మూవీని పీరియాడిక్ జాన‌ర్ లో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. యువి క్రియేష‌న్స్ ఈ సినిమాను రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించ‌బోతుంది. అనిల్ కుమార్ అనే వ్య‌క్తి ఈ సినిమాతో వెండితెర‌కు డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కానున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్ లో క‌నిపించనున్నాడట‌.

దాని కోసం ప్ర‌స్తుతం త‌న‌ను తాను మేకోవ‌ర్ చేసుకుంటున్నాడు. ఓ వైపు యుద్ధ విద్య‌లు నేర్చుకుంటూనే మ‌రోవైపు క్యారెక్ట‌ర్ లుక్ పై దృష్టి పెట్టాడు. కొంత‌మంది ఈ సినిమా సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో రూపొంద‌నుంద‌నే వార్త ప్రచారంలోకి వ‌స్తోంది. అయితే అందులో ఎలాంటి నిజం లేద‌ని, ఈ సినిమాలో అఖిల్ 11వ శ‌తాబ్ధానికి చెందిన ఓ ట్రైబ‌ల్ వీరుడిగా క‌నిపించ‌నున్నాడని, అఖిల్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని, సినిమా షూటింగ్ మొత్తం ఫారెస్ట్ లోనే జ‌ర‌గ‌నుంద‌ని, అఖిల్ కు ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ సినిమా అయినా అఖిల్ కు కోరుకున్న ఫ‌లితాన్నిస్తుందేమో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :