మరోసారి నెట్టింట సమంత హల్చల్
విడాకుల తర్వాత రెండేళ్ల పాటూ సమంత(Samantha) ఎప్పుడు వార్తల్లో నిలిచినా నెగిటివ్ విషయాలతోనే అవుతోంది. ఖుషి(Kushi) తర్వాత సమంత సినిమాలు చేసింది లేదు. వ్యక్తిగత జీవితం, అనారోగ్యం కారణంగా సమంత కూడా అన్నింటికీ దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey Bunny) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఫ్యామిలీ మ్యాన్(Family Man) తో మంచి క్రేజ్ సంపాదించిన రాజ్(Raj), డీకే(DK) రూపొందించిన ఈ సిరీస్‌కు హాలీవుడ్ సిటాడెల్ సిరీస్‌తో కనెక్షన్ ఉన్నప్పటికీ, దాన్ని మన ఆడియన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దాలని ట్రై చేశారు. ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో కాకపోయినా ఆడియన్స్ ను అలరించేలానే సిటాడెల్ ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన దగ్గర్నుంచి సమంత నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమెకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ముఖ్యంగా సమంత నటించిన ఇంటిమేట్ సీన్స్, వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధావన్(Varun Dhawan)- సమంత లాంగ్ లిప్ లాక్ సీన్, సమంత అందాలను ఎలివేట్ చేసే వేరే సీన్స్ కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. సమంత కోసమైనా ఈ సిరీస్ చూడొచ్చని సిటాడెల్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.