ASBL Koncept Ambience
facebook whatsapp X

కేడర్ నిర్వీర్యం.. కేసీఆర్ మౌనం..!! BRSలో ఏం జరుగుతోంది..?

కేడర్ నిర్వీర్యం.. కేసీఆర్ మౌనం..!! BRSలో ఏం జరుగుతోంది..?

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మౌనంగా ఉండడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. క్యాడర్ మొత్తం అయోమయంగా మారింది. నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత ఎలాంటి పరిణామాలను పేస్ చేయాల్సి వస్తుందని వణికిపోతున్నారు. ఇప్పటికే పలు కేసులు బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. ఒకవైపు కవిత అరెస్టు, మరోవైపు పార్టీ ఓటమి, ఇంకోవైపు నేతలపై కేసులు, నేతలు పార్టీని వీడుతుండడం.. లాంటి అనేక పరిణామాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం నోరు మెదపట్లేదు.

తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. తెలంగాణలో ఆయన ఒక శక్తిగా ఎదిగారు. 14 ఏళ్ళు ఉద్యమం, పదేళ్లు అధికారం టిఆర్ఎస్ సొంతమైంది. అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో ఉంది. హై కమాండ్ నుంచి తగిన భరోసా నేతలకు రాకపోవడంతో వాళ్లంతా గందరగోళంలో ఉన్నారు. పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీ మారబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.

కవిత అరెస్టు అయ్యి 100 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన వాళ్లంతా బెయిల్ పై బయటకు వచ్చేశారు. కానీ కవితకు మాత్రం ఇంతవరకు బెయిల్ లభించలేదు. ఆమెను కేటీఆర్ హరీష్ రావు లాంటివాళ్ళు జైలుకెళ్లి అడపాదడపా పరామర్శిస్తున్నారు. కానీ కెసిఆర్ మాత్రం కవిత జైలుకు వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్లి పరామర్శించలేదు. సొంత కూతురే ఇబ్బందుల్లో ఉన్న కేసీఆర్ అంటి ముట్టనట్లే ఉండటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎన్నికల్లో పార్టీ ఓడినప్పుడు ప్రజా తీర్పును శిరసా వహించడం పార్టీల లక్షణం. గెలిచిన పార్టీలను ఓడిన పార్టీల అధినేతలు అభినందిస్తూ సహకరిస్తామని చెప్తుంటారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ ఒక్కసారి కూడా బయటకు రాలేదు. గెలిచిన ప్రభుత్వాన్ని స్వాగతించలేదు. లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయినా కేసీఆర్ మాత్రం ఎవరిని స్వాగతించలేదు. గతంలో ఎంతో హుందాతనంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకిలా మౌనంగా ఉంటున్నారు అనేదానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక, కేసుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక, కెసిఆర్ తీవ్ర మనస్తాపం చెందుతున్నారని సమాచారం. అయితే కేసీఆర్ మౌనం పార్టీ క్యాడర్ను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన బయటకు వచ్చి మాట్లాడడమే మంచిదని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :