nandini sidhareddy praised telugutimes

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రపంచ తెలుగుమహాసభలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆశయానికి తోడుగా తెలుగు ఎన్నారైలు మద్దతు ఇవ్వాలని ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌ కమిటీ సభ్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. ప్రపంచంలోని తెలుగు ఎన్నారైలను ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నామని, ముఖ్యంగా అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగువారు ఈ మహాసభలకు పెద్దఎత్తున హాజరుకావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.  తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు ఈరోజు నందిని సిధారెడ్డిని కలిసి అమెరికాలోని తెలుగు ఎన్నారైలకు 14 సంవత్సరాలుగా తెలుగు టైమ్స్‌ చేస్తున్న సేవలను వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా తెలుగు టైమ్స్‌ చేస్తున్న సేవలను తెలిపారు. అమెరికాలోని తెలుగు ఎన్నారైలను ఇందులో పాలుపంచుకునేలా చేస్తున్నట్లు చెప్పారు.