తెలుగు భాషా సేవలో తెలుగుటైమ్స్

తెలుగు భాషా సేవలో తెలుగుటైమ్స్

17-03-2020

తెలుగు భాషా సేవలో తెలుగుటైమ్స్

తెలుగుభాషకు మీడియారూపంలో 17 సంవత్సరాుగా తెలుగుటైమ్స్‌ సేవందిస్తోంది. అటు ప్రింట్‌ రూపంలో, ఇటు తెలుగుటైమ్స్‌.నెట్‌ పోర్టల్‌ ద్వారా అమెరికాలోని తెలుగువారికి సేవందిస్తున్న తెలుగుటైమ్స్‌ తెలుగుభాషా సేవలో భాగంగా  17 మంది తెలుగు భాషా ప్రముఖులను ఈ సంచికలో పరిచయం చేస్తోంది.

2003లో తెలుగుటైమ్స్‌ను ప్రారంభించినప్పుడు అమెరికాలో తెలుగుపత్రికనా అని ఆశ్చర్యపోయినవారు ఆ పత్రిక మొదటి సంచికను చూసిన తరువాత ఎంతోమంది ప్రశంసలను అందించారు. ఆ తరువాత మెల్లమెల్లగా ఎన్నారైలకు నచ్చేలా ఎప్పటికప్పుడు వార్తలను, ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ నాటి నుంచి నేటి వరకు తెలుగుటైమ్స్‌ పత్రిక ముందుకెళుతోంది. బే ఏరియాలో అత్యధిక పాఠకులను కలిగిన తెలుగుటైమ్స్‌ తరువాత పలు నగరాలకు విస్తరించింది. ప్రపంచంలోని ఎన్నారైలకు అమెరికాలోని ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలను, సేవను తెలియజేసే మీడియా సాధనంగా తెలుగుటైమ్స్‌ ఉంటోంది. ప్రతి వార్షికోత్సవ సమయంలో తెలుగుటైమ్స్‌ ప్రత్యేక శీర్షిక పేరుతో అమెరికాలోని మనవాళ్ళ గురించి, మన అసోసియేషన్ల గురించి, మనవాళ్ళ కుటుంబ పరిచయం, కమ్యూనిటీ సేవ, వ్యాపారరంగంలో రాణించిన విధానాన్ని, ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ గురించి ఇలా పలు ప్రత్యేకతలతో వార్షికోత్సవ సంచికను మీ ముందుకు తీసుకువస్తోంది. 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి తెలుగు భాషకు మిక్కిలి సేవ చేసిన 17 మందిని ఈ సంచిక ద్వారా పరిచయం చేస్తోంది. తెలుగు భాషకు, తెలుగుదనానికి వారు చేసిన సేవను గుర్తిస్తూ, వారి కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిని కలిగించాన్న ఉద్దేశ్యంతో వారి సేవను ఈ సంచిక కవర్‌ స్టోరీగా ప్రచురించింది.

తెలుగు భాషకు తెలుగుటైమ్స్‌ మొదటి నుంచి కృషి చేస్తూనే ఉంది. అమెరికాలో తెలుగు భాషలో ఓ పత్రికను తీసుకురావడంతో పాటు తెలుగు టైమ్స్‌ తెలుగు భాషా సేవ, జొన్నవిత్తులలాంటి కవులతో మనవాళ్ళు మనభాష పేరుతో సమావేశాలను ఏర్పాటు చేయించడం, తెలుగు చిన్నారుల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి వారికి భాషను నేర్పించడం, తెలుగు ను సులభంగా నేర్పించేలా సిలబస్‌ను తయారు చేయించడం వంటి కార్యక్రమాలను తెలుగుటైమ్స్‌ చేసింది. ఇక్కడ ఉన్న వివిధ తెలుగు సంఘాలు జరిపే తెలుగు సాహిత్య కార్యక్రమాలకు ప్రచార బాధ్యతలను కూడా తెలుగు టైమ్స్‌ చేపట్టింది. ప్రపంచ తెలుగు మహాసభలు అమెరికాలో జరిగినా, ఆంధ్ర, హైదరాబాద్‌లో జరిగినా తెలుగుటైమ్స్‌ అందులో కీక పాత్రను పోషించింది. తెలుగు టైమ్స్‌ చేస్తున్న తెలుగు భాష సేవను గుర్తించిన ప్రభుత్వాలు తెలుగు ప్రపంచ మహాసభల్లో తెలుగు టైమ్స్‌కు ప్రత్యేక బాధ్యతను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. విదేశాల్లోని తెలుగువారికి సేవలందించి నందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో తెలుగుటైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావును సత్కరించిన సంగతి కూడా విదితమే.

అమెరికాలో వివిధ నగరాల్లో ఉంటూ తెలుగు వెలుగుకు ఎంతో కృషి చేస్తున్న మహనీయులను అందరినీ ఒకేచోటకు తీసుకువస్తూ, తెలుగు భాషా సేవలో 17 మంది ప్రముఖులు పేరుతో ప్రత్యేక శీర్షిక ద్వారా వారిని ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయం చేస్తోంది.