భారత పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. దావోస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భారత్, ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారంటూ చంద్రబాబును రాహుల్ బజాజ్ కొనియాడారు. ఈ సందర్భంగా రాహుల్ బజాజ్‌ను శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి కొండపల్లి బొమ్మలను బహూకరించారు. 

ఎయిర్ బస్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డర్క్ హోక్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. చంద్రబాబుతో సమావేశం కావడం డర్క్ హోక్‌కు ఇది మూడవ సమావేశం. గత ఏడాది దావోస్ సదస్సులో, ఆ తరువాత ఆగస్టులో మరోసారి చర్చలు జరిపారు. 

Click here for Photogallery