దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో జేపీ మోర్గాన్ ఛేస్ (Jp Morgan Chase) వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కల సహజవనరులు, అపరిమిత అవకాశాలపై ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఆర్ధిక, సాంకేతికాంశాలలో తమ ప్రభుత్వానికి సహకరించాలని మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) కు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలలో ఐఓటి పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చెబుతూ ‘కోర్ డ్యాష్ బోర్డు’ ప్రత్యేకతను వివరించారు. జేపీ మోర్గాన్ ఛేజ్ అధిపతి ఆసక్తిగా విన్నారు. సంస్థకు ఉన్న అంతర్జాతీయ కార్యవ్యవస్థ ద్వారా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరారు.\r\n\r\n

తిరుపతి నగరాభివృద్ధికి జపాన్ రెడీ
ప్రపంచమంతా ప్రణమిల్లే తిరుమల శ్రీవారి సన్నిధికి ఆధ్యాత్మిక ముఖద్వారం తిరుపతి నగరం. అంతటి ప్రాముఖ్యమున్న తిరుపతి నగరాన్ని అభివృద్థి చేయటానికి జపాన్ కు చెందిన ‘కుమియుమి అస్సెట్స్ కంపెనీ’ ముందుకు వచ్చింది. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

తమకు ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించగా, స్పష్టమైన ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


Click here for Photogallery