సత్యనాదెళ్లతో సీఎం చంద్రబాబు భేటీ

19-04-2017

సత్యనాదెళ్లతో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా మైక్రోసాప్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కోసం అవలంభించిన సాంకేతిక విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. 30శాతంగా ఉన్న డిజిటల్‌ లావాదేవీలను మార్చి నాటికి 70 శాతానికి తీసుకొస్తామని తెలిపారు. ఈ-గవర్నెన్స్‌, సైబర్‌ భద్రత అంశాల్లో కలిసి పని చేయాలని సత్యనాదెళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. హైబ్రిడ్‌క్లౌడ్‌ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సత్యనాదెళ్ల సూచించారు. సాంకేతిక ప్రగతికి హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ దోహదం చేయగలదన్నారు.