కాలిఫోర్నియా తెలుగు సమితి ఉగాది వేడుకలు

03-05-2017

కాలిఫోర్నియా తెలుగు సమితి ఉగాది వేడుకలు

కాలిఫోర్నియా తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఇటీవల వైభవంగా నిర్వహించారు. దుర్ముఖినామ సంవత్సరానికి శాక్రమెంటో తెలుగువారు సాదరంగా స్వాగతం పలికారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా కళాకారుడు ప్రదీప్‌, రిటైర్డ్‌ డిఐజీ దినకర్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. ఈవేడుకలను పురస్కరించుకుని ఆర్ట్‌, కుకింగ్‌, డ్రస్‌,  వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహూమతులను అందజేశారు. చిన్నారులు, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమాలతోపాటు టాలీవుడ్‌ సినీ గీతాలకు మంచి స్పందన కనిపించింది. సిటిఎ ప్రముఖులు కుమార్‌ కలగరతోపాటు నటరాజన్‌ గుట్ట, వసుంధర వేదాంతం, విష్ణువర్థన్‌ రెడ్డి కట్ట, సుధీర్‌, సునీల్‌, ప్రభాకర్‌ అయ్యగారి, చందు యల్లా, అమితాబ్‌ షేక్‌, వెంకట్‌ మేచినేని తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.


Click here for Event Gallery