న్యూజెర్సిలో తెలుగు కళాసమితి (టిఫాస్‌) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. ఏప్రిల్‌ 16వ తేదీన ఉడ్‌బ్రిడ్జ్‌ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది తెలుగువాళ్ళు హాజరయ్యారు. ఈ వేడుకల్లో టిఫాస్‌  ప్రెసిడెంట్‌గా గురు ఆలంపల్లి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఫాస్‌ సీనియర్ల సహకారాలు, సలహాలు, సూచనలతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళుతానని చెప్పారు. కమ్యూనిటీకి మరింత సేవలందించేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కూడా తెలియజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మైమరపింపజేశాయి. గాయనీ గాయకులు దినకర్‌, అంజనాసౌమ్య పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ఉడ్‌బ్రిడ్జ్‌ మేయర్‌ జాన్‌ మెక్‌కూర్మక్‌తోపాటు, న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల, తానా, నాటా, నాట్స్‌ నాయకులతోపాటు కళాభారతి సంస్థల ప్రతినిధులు వచ్చారు.


Click here for Event Gallery