ఆటాలో నోరూరించే వంటకాలు

01-05-2017

ఆటాలో నోరూరించే వంటకాలు

అమెరికా తెలుగు సంఘం సిల్వర్‌ జూబ్లి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చే అతిధులకోసం ఎన్నో వంటకాలను సిద్ధం చేసింది. అచ్చమైన తెలుగు వంటకాలను ఈ వేడుకల కోసం సిద్ధం చేశారు. గోంగూర, పప్పు, ఉలవచారు, వంకాయ మసాల, వెజ్‌ బిర్యానీ, పచ్చిమిరపకాయ బజ్జీలు వంటి వంటకాలతోపాటు చేపలకూర, నాటుకోడీ పులుసు, రొయ్యల కూర, మటన్‌, హైదరాబాద్‌ చికెన్‌ దమ్‌ బిర్యానీ వంటి వంటకాలు కూడా ఏర్పాటు చేశారు.